SRD: పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం సమీపానికి చెందిన వేణు ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 2న భార్య కుమారితో డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. అనంతరం వేణు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఫోన్కు సంప్రదించగా స్విచ్ఛాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.