ASR: మండల స్పెషల్ అధికారులు ఎన్యూమరేటర్లతో ప్రత్యేకంగా సమీక్షించి, మండల పరిధిలో సెన్సెస్ నూటికి నూరుశాతం పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ నిశాంతి బుధవారం అధికారులను ఆదేశించారు. మండల స్పెషల్ అధికారులు తమ పరిధిలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఉన్న ప్రతిఒక్కరి వివరాలను సెన్సెస్ లో నమోదు చేయాలన్నారు. అలా జరగనట్లయితే అందుకు బాధ్యత స్పెషల్ అధికారులే వహించాలన్నారు.