SRD: పంటల వైవిధ్యీకరణతో రైతులు లాభాలు పొందవచ్చని ఖేడ్ ADA నూతన కుమార్ గురువారం తెలిపారు. 2026 ఈ ఏడాదిలో L-Nino ప్రభావం ఉన్న దృష్ట్యా, ఆలస్యంగా వర్షాలు, భూగర్భ జలాలు లేకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరి సాగును తగ్గించాలని చెప్పారు. పంటల వైవిద్యీకరణతో కరువు తట్టుకునే సామర్థ్యం, సాగు ఖర్చులు తగ్గుతాయన్నారు.