అఫ్ఘానిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు జమ్మూకాశ్మీర్ స్పీడ్‌స్టార్ ఆకిబ్ నబీకి చోటు దక్కకపోవడంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ విమర్శలకు తలొగ్గిన బీసీసీఐ.. ప్రస్తుతానికి అతడిని ఈ సిరీస్‌కు నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది. అయితే, సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో నబీకి ప్రధాన జట్టులో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.