ASR: చింతపల్లి మండలం దబ్బగరువు జంక్షన్ వద్ద మంగళవారం ఆటో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.