ADB: ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని డీఎల్పీవో ప్రభాకర్ అన్నారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లారావు, పంచాయతీ కార్యదర్శి మోతిరాం, సర్పంచ్ కావేరి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బ్రీజ్ లాల్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గోవింద్, దిగంబర్, కొర్రల మహేందర్ పాల్గొన్నారు.