ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం గరిమండ వారపు సంతను ఆయన సందర్శించారు. సంతకు వచ్చే గిరిజనులు కల్తీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారపు సంతల్లో కల్తీ వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.