అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఈడిగపాళెం 2, 5 వార్డులలో సోమవారం ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్’ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి అర్హుడికీ సంక్షేమ పథకాలు చేరవేస్తుందని ఆయన తెలిపారు.