ఖమ్మం నగర పరిశుభ్రత నిర్వహణలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (FSTP) కీలక పాత్ర పోషిస్తూ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తూ, పర్యావరణహితంగా అధికారులు ఈ ప్లాంట్ ను నిర్వహిస్తున్నారు. దీనివల్ల అక్రమ మలినాల పారుదల కు అడ్డుకట్ట పడడంతో పాటు భూగర్భ జలాలు, ప్రజారోగ్యం సంరక్షించబడుతున్నాయి.