ADB: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 20 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ పథకాలు ప్రదానం చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. సేవా పతకాలు పొందిన సిబ్బందిని ఆయన అభినందించారు.