గద్వాలలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఉదయ్ అసోసియేషన్ నాయకులు గద్వాల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగ దివ్యాంగుల రెజ్యూమేను స్వీకరించిన కలెక్టర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, అంగన్వాడీ పోస్టుల్లో దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.