NRML: భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైస్ మిల్లును పరిశీలించి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.