కృష్ణా: మచిలీపట్నం 20వ డివిజన్ గిలకలదిండి ప్రాంతంలోని లబ్ధిదారులకు మంత్రి కొల్లు రవీంద్ర పెన్షన్ నగదును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటవ తేదీనే పెన్షన్ నగదును పంపిణీ చేస్తున్నామని అన్నారు. భర్త చనిపోయిన మహిళలకు మనసుంటే నెల నుంచి వారి భార్యకి పెన్షన్ నగదును అందజేస్తున్నామని తెలిపారు.