NGKL: శ్రీశైలం ఉత్తరద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వరం క్షేత్రం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం ఈ నెల 3న ఆలయ ఆవరణలో నిర్వహించనున్నారు. ఛైర్మన్ బీరం మాధవరెడ్డి సహా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.