VZM: బొబ్బిలి MPDO రవికుమార్ సోమవారం మండలంలోని స్థానిక అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించి, పరిసరాల పరిశుభ్రత, ఆహార నాణ్యతను తనిఖీ చేశారు.అనంతరం టిఫిన్‌ను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.