KRNL: ఆస్పరి ములుగుందం గ్రామంలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉన్న మురుగు కారణంగా దుర్వాసనతో పాటు వ్యాధులు ప్రబలుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఇళ్ల ముందు మురుగు నీరు నిలిచి ఉందని, అధికారులకు కోరారు.