గతంలో పరీక్షలంటే కేవలం కఠిన ప్రశ్నల గురించే భయపడేవారు. కానీ నేడు పరీక్షలు సజావుగా జరుగుతాయా, ఫలితాలు సరిగ్గా వస్తాయా అనే ఆందోళన పెరిగింది. NTA, CBSE వంటి సంస్థల వైఫల్యాలు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నీట్ పేపర్ లీక్, CBSE 12వ తరగతి ఫలితాల వివాదం, తాజాగా CUET-UG పరీక్షలో సాంకేతిక సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.