AP: రాష్ట్ర నూతన సీఎస్‌గా జి సాయి ప్రసాద్ రేపు ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత CS విజయానంద్ పదవీ కాలం ముగుస్తుండడంతో తదుపరి సీఎస్‌గా సాయిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.