RR: మియాపూర్ 101 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో నకిలీ పత్రాలతో నిర్మిస్తున్న ఆరు అంతస్తుల అక్రమ కట్టడాన్ని నిలిపివేసి, కూల్చివేయాలని MCPI(U) సహాయ కార్యదర్శి పల్లె మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు లేఔట్ కాపీలతో ఫిర్యాదు చేయగా, డిప్యూటీ తహిసీల్దార్ మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి తక్షణ స్థల పరిశీలన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.