GNTR: తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో నిర్వహించిన టీడీపీ డిజిటల్ మహానాడు రెండో రోజు వేడుకల్లో దర్శి టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు. పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.