చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నాడు. ‘సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ను నా తండ్రితో కలిసి టీవీలో చూశాను. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ మా తండ్రి వారిపై అరిచాడు. వారిని శపించాడు’ అని తెలిపాడు.