ASR: ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డుంబ్రిగూడ మండలం పరిడి పీసా కమిటీ కార్యదర్శి వంతల రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఎండల మధ్య పనులకు హాజరవుతున్న కూలీలకు సాంకేతిక సమస్యలు మరింత భారంగా మారుతున్నాయని తెలిపారు. పాత విధానాన్నే అమలు చేయాలని మంగళవారం డిమాండ్ చేశారు.