W.G: వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు పని ప్రాంతాల్లో మజ్జిగ, మంచినీరు సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ భీమవరంలో డ్వామా పీడీ డాక్టర్ అప్పారావుకు వినతిపత్రం అందజేశారు. రోహిణి కార్తె ప్రారంభమైనందున, కూలీలు ఉదయం 10 గంటలకల్లా ఇంటికి చేరేలా చూడాలన్నారు.