KDP: ప్రొద్దుటూరులో గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు పాల అమ్మకాలపై తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో 4, కడపలో 7 శాంపిల్స్ తీశామని, మొత్తం11 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వీటిని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.