VKB: బంట్వరం(M)లో VOAల నిరవధిక సమ్మెకు బస్వాపూర్ గ్రామ సర్పంచ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆమె, VOAలతో కలిసి కూర్చుని సంఘీభావం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న VOAల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సర్పంచ్ మద్దతు తెలపడంతో VOAలు హర్షం వ్యక్తం చేశారు.