KMR: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.