W.G: పట్టణాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భీమవరంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని శనివారం ప్రకాశం చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారుల స్వీపింగ్, కాలువల్లో మురుగు, వ్యర్థాల తొలగింపు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు.