NZB: ఆర్మూర్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలనీ శనివారం పీడీఎస్యు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. కార్పోరేట్ విద్యా సంస్థల్లో యాజమాన్యం విద్యార్థుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.