SKLM: వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.