WGL: వరంగల్ పట్టణంలోని రంగశాయిపేట కాపువాడకు చెందిన భాగ్యలక్ష్మి (ఒంటరి మహిళ) శనివారం మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెన్షన్ లైవ్ సర్టిఫికెట్ కోసం మహంకాళి సెంటర్కు వెళ్లిన ఆమె పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వెంటనే తీవ్రమైన ఎండదెబ్బకు కళ్లు తిరిగి కుప్పకూలినట్లు పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగానే మహిళ మృతి చెందినట్లు భావిస్తున్నారు.