CTR: జిల్లాలో ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4,830 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. పరీక్షలకు 32 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.