NDL: ‘వన్ మంత్-ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయి PGRS నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.