JN: తరిగొప్పుల మండలం నర్సాపూర్‌కు చెందిన రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేవాదుల జలాలతో స్థానిక ఊరకుంటను నింపాలని సర్పంచ్ కొండ్ర తార కుమార్ శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గండిరామరం పంప్ హౌస్ వద్ద సాగుతున్న పనుల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఈ మేరకు సమస్యను వివరించారు.