BDK: మణుగూరు మండలానికి చెందిన సక్సెస్ స్పార్క్ అకాడమీ విద్యార్థిని నాగుల జ్ఞానప్రసూనేశ్వరి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో విశేష ప్రతిభ కనబరిచి పినపాక నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.