ఖమ్మం ముస్తాఫా నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ సలీం (42) ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి శుక్రవారం మృతి చెందారు. రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ఆయన, శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.