ELR: మండవల్లి మండలం నాగభూషణపురంలో భార్య మేఘనను హత్య చేసి, గుండెనొప్పితో చనిపోయినట్లు చిత్రీకరించిన భర్త ప్రదీపన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది వివాహమైన ఈ జంట మధ్య అట్లతద్ది వాయినాల విషయమై గొడవ జరిగింది. భార్య తన మాట వినడం లేదనే కక్షతో ఫిబ్రవరి 9న ప్రదీప్ ఆమె పీక పిసికి అమానుషంగా హత్య చేశాడు.