RR: సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో సబ్ స్టేషన్ల సమీపంలో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్లాంట్ల నిర్మాణానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలన్నారు.