SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరి అన్నారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమన్నారు.