KNR: దేశ అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతి, యువత సాధికారత కోసం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయమైన సేవలు అందించారని TG PCC ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. గురువారం గాంధీ భవన్లో జరిగిన రాజీవ్ గాంధీ 35వ వర్థంతి వేడుకల్లో ఆయన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.