1983 వరల్డ్ కప్ గెలిచాక భారత ఆటగాళ్లు ఓ హోటల్లో భారీఎత్తున పార్టీ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు సంబంధించిన బిల్ అంటూ నెట్టింట ఓ ఇమేజ్ వైరల్ అయింది. దీనిని మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న ఆటగాడు కీర్తి ఆజాద్ కొట్టిపడేశాడు. ఆ బిల్ అసత్యమని తెలిపాడు. దానిపై ఉన్న సంతకం కూడా కపిల్ దేవ్ది కాదని స్పష్టం చేశాడు.