AP: అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం గొడిచర్లలో జ్వరాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. గొడిచర్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. గొడిచర్ల గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు.