NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 క్రికెట్ జట్లకు ఉచితంగా కిట్లు పంపిణీ చేశారు. ఎన్నికల హామీ మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. యువత క్రీడల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.