CTR: కాణిపాకం ఆలయ ఉభయదారుల వ్యవస్థ కాపాడాలని ఉభయదారులు రాజ్ కుమార్, గోపీనాథ్, పరదేశి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం వారు మాట్లాడుతూ.. ఆలయం ఏర్పడిన నాటి నుంచి ఉభయదారుల వ్యవస్థ కొనసాగుతోందని చెప్పారు. ఆలయ అభివృద్ధిలో వారి సలహాలు తీసుకోవాలని కోరారు. ఈనెల 24న నిర్వహించే నూతన అధ్యక్షుడి ఎంపిక సమావేశంలో ఉభయదారులందరూ పాల్గొనాలన్నారు.