HYD: పంజాగుట్ట ఫ్లైఓవర్ దిగిన కొద్ది దూరంలోనే రోడ్డుపై ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. వేగంగా వచ్చే వాహనాలు ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ గుంత వల్ల అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒకరిని తప్పించబోయి మరొకరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు నివారించేందుకు అధికారులు స్పందించి, తక్షణమే ఈ గుంతకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.