RR: వనస్థలిపురంలో భార్య, బావమరిది కలిసి జరిపిన దాడిలో గురు వెంకటేశ్(31) అనే వ్యక్తి మృతి చెందాడు. మద్యం అలవాటు వల్ల భార్య స్వప్నతో విడిపోయిన వెంకటేశ్, మంగళవారం రాత్రి పిల్లలను చూసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో స్వప్న సోదరుడు పాండు, స్నేహితుడు జగదీశ్‌లు వెంకటేశ్‌పై తీవ్రంగా దాడి చేయడంతో అతను కుప్పకూలి చనిపోయాడు.