TPT: చెన్నై నుంచి సూళ్లూరుపేట వరకు లోకల్ ట్రైన్లో తిరుగుతూ ప్రయాణికులను బెదిరించి సెల్ఫోన్లు, నగదు దోచుకుంటున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలోనూ వీరిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.