SRCL: నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెరలో చిన్నారి పాప హత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారి హత్యకు కారకులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.