BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.