MLG: కన్నాయిగూడెం మండలంలో 99 రోజుల పనుల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో పనులు పూర్తయ్యాయని చూపుతున్నప్పటికీ, స్థలంలో మార్పులేదని ప్రజలు అంటున్నారు. కొన్ని పనులు ప్రారంభం కాకపోవడం, మరికొన్ని మధ్యలోనే ఆగిపోవడం గమనార్హం. నిధుల వినియోగంలో పారదర్శకత లోపంఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.