NLG: 2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.